మోహన్ బాబుకు హైకోర్టు షాక్..
సీనియర్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు ముందస్తు బెయిల్‌పై ఆయనకు మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా మీడియా తరపు న్యాయవాది వాదిస్తూ, మోహన్ బాబు దుబాయ్ వెళ్తున్నారని ఆరోపించారు. ఎక్కడికీ వెళ్లడం లేదని మోహన్ బాబు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరువురిని అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఆదేశించింది. జల్ పల్లిలోని తన ఇంట్లోకి రానివ్వలేదంటూ మంచు మనోజ్ వెళ్లిన సందర్భంలో మోహన్ బాబుతో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధులపై చెయ్యిచేసుకున్న సంగతి తెలిసిందే.