బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టు బిగ్ షాక్..
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆయన భారత పౌరుడు కాదని, జర్మన్ పౌరుడు అని హైకోర్టు తేల్చి చెప్పింది. చెన్నమనేని పౌరసత్వంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తుది విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రూ.30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. రూ.30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొన్నది. అయితే.. కోర్టు తీర్పు పైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని రూ.30 లక్షలు చెన్నమనేని రమేశ్ చెల్లించారు.