జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్
జమ్ముకశ్మీర్‌లో మరోసారి హై అలర్ట్ జారీ చేశారు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం మరోసారి ఉగ్రదాడి జరగవచ్చనే హెచ్చరికలతో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. లష్కరే తొయిబా దాడులు చేయెచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పర్యాటక స్థలాలలో భద్రతను అధికం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఇప్పటికే కాల్పులు కొనసాగుతున్నాయి. పాక్‌తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోపక్క పాక్ రక్షణ మంత్రి అంతర్జాతీయ దర్యాప్తుకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

