పదేళ్ల తర్వాత బాలీవుడ్‌లో హీరో ధనుష్ రీఎంట్రీ
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల కాలంలో విడుదలైన “సార్” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తమిళలో తెరకెక్కినప్పటికీ..దీనిని తెలుగు,హిందీలో కూడా డబ్ చేశారు. కాగా ఈ సినిమా విడుదలైన 3 భాషల్లో సూపర్ హిట్ అందుకుంది. దీంతో హీరో ధనుష్ బాలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అయితే దాదాపు పదేళ్ల తర్వాత ఆయన బాలీవుడ్‌లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. “తేరే ఇష్క్ మే” అనే పేరుతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు ధనుష్ తన ట్విటర్ ద్వారా తెలిపారు. అయితే ఈ సినిమాకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. హీరో ధనుష్ పదేళ్ల క్రితం రాంజనా సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. అయితే మరి ఇప్పుడు ఈ సినిమాతో ధనుష్ బాలీవుడ్‌లో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాల్సివుంది.


 
							 
							