మనుషుల్లో బర్డ్‌ఫ్లూను ఇలా గుర్తించండి..
ఏపీ వ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో లక్షల్లో కోళ్లు మరణిస్తున్నాయి. అయితే ఈ వ్యాధి వల్ల మనుషులకు కూడా ప్రమాదమేనంటున్నారు వైద్యులు. దీనితో చికెన్ ప్రియులకు షాక్ తగలనుంది. బర్డ్‌ఫ్లూ సోకిన కోళ్లను, వాటి గుడ్లను తినడం వల్ల ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. ఈ వ్యాధి కూడా ఇంచుమించు కరోనా లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది సోకినవారికి జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, తీవ్రమైన బలహీనత, కంటివాపు, శ్వాసకోశవ్యాధులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. గ్రిల్డ్ చికెన్, హాఫ్ బాయిల్డ్ వంటి వంటకాలను తినకూడదని హెచ్చరిస్తున్నారు. తినాలనుకుంటే పూర్తిగా బాగా అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించిన వాటిని తీసుకోవచ్చని పేర్కొన్నారు. వాటిని కడిగేటప్పుడు కూడా వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధి తీవ్రమైతే మరణానికి కూడా దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.