Breaking NewsHealthHome Page SliderInternational

ఇక నుంచి అత‌ను మాన‌వ వారాహి

వైద్యరంగ చరిత్రలోనే సరికొత్త అధ్యయం లిఖించారు చైనా డాక్టర్లు.మనిషికి వ‌రాహ కాలేయాన్ని అమర్చి.. లివర్‌ మార్పిడి ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. మనిషికి అమర్చిన ఆ లివర్‌ ఎంతో బాగా పనిచేస్తోంది. వ‌రాహ కాలేయాన్ని మనిషికి పెట్టడం అనేది ప్రపంచంలోనే ఇదే తొలిసారి. గతంలో అమెరికాలో వ‌రాహ‌ గుండె, కిడ్నీలను మనుషులకు అమర్చారు కానీ, లివర్‌ను మార్పిడి చేయడం ఇదే ఫస్ట్‌ టైమ్‌ను. ఈ ఘనతను చైనా వైద్యులు సాధించారు. అయితే.. ఈ ప్రయోగాన్ని ఒక బ్రెయిన్‌ డెడ్‌ పేషెంట్‌పై చేశారు. అలాగే లివర్‌ను దానం చేసిన వారాహం సాధారణ వరాహం కాదు. దానిలో ముందుగానే జన్యుపరంగా కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత దాని నుంచి లివర్‌ తీసి.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యత్తికి అమర్చారు. పది రోజుల పర్యవేక్షణ తర్వాత ఆ లివర్‌ బాగానే పనిచేస్తోంది అంటూ వైద్యులు ప్రకటించారు.