Home Page SliderNational

కాసేపట్లో ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.నిన్న చంపై సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.దీంతో ఝార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాధాకృష్ణన్ హేమంత్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరగనుంది.కొన్ని నెలల క్రితం మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు హేమంత్ సోరెన్‌కు బెయిల్ మంజూరు చేసింది.