హైద్రాబాద్‌లో హెల్మెట్ నిబంధనలు కఠినతరం
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వాహనదారులపై రేవంత్ ప్రభుత్వం ఇక నుంచి కొరడా ఝుళిపించనుంది. ఈ మేరకు పోలీసులు మంగళవారం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 200లు ఆ పైన జరిమాన విధించనున్నారు. అదేవిధంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడిపితే రూ.2000ల వరకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నూతన నిబంధనలను పోలీసులు కఠినతరం చేశారు.