కాసేపట్లో భారీ వర్షం
రానున్న 3-4 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోనూ రాత్రి వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగరంలో కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో జంట జలాశయాలు నిండుగా మారిపోయాయి. మరో వైప తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.

