అద్దె కట్టలేదని మహిళను కత్తితో పొడిచాడు
తెలంగాణలో ఓ ఇంటి ఓనర్ ఘాతుకానికి పాల్పడ్డాడు,విచక్షణా రహితంగా మహిళపై దాడి చేశాడు. ఇంటి అద్దె చెల్లించలేదని ఏకంగా కత్తితోపొడిచాడు. తెలిసిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ హసన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటి ఓనర్ తన ఇంట్లో అద్దెకు నివాసం ఉండే ఓ కుటుంబంతో గొడవ పడ్డాడు.గత కొద్ది నెలల నుంచి సదరు కుటుంబీకులు అద్దె చెల్లించకపోవడంతో ఊగిపోయాడు. వెంటనే కరెంట్ కట్ చేశాడు.దీంతో అద్దెంట్లో మహిళ ఓనర్‌తో వాగ్వివాదానికి దిగింది.మాటా మాటా పెరగడంతో కత్తితో తెగబడ్డాడు.అద్దెకు ఉంటున్న కుటుంబీకుల్లో ఓ మహిళను కత్తితో పొడిచాడు.తలపైనా దాడి చేశాడు.తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు మహిళను ఆసుపత్రికి తరలించారు.ఆ తర్వాత ఓనర్‌పై బాధితురాలి బంధువులు దాడికి యత్నించారు.విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.