‘ఆయనకు సీఎం పదవి త్రుటిలో మిస్ అయ్యింది’.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి త్రుటిలో మిస్ అయ్యిందని, వచ్చే పర్యాయం తప్పకుండా ముఖ్యమంత్రి పీఠం ఉత్తమ్‌కే దక్కుతుందని జోస్యం చెప్పారు. ఆయన ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారూ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంబోధించారు. తన నాలుకపై నల్లమచ్చలు ఉన్నాయని నేను ఏది చెపితే అది జరిగి తీరుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.