మెగా ఫ్యామిలీ మొత్తానికి బాస్ అతనే అంట !
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరు తారగా ఎదగాలన్నా, వెండితెరపై చిరకాలం ఎవరు తళుకులీలాలన్నా మెగా ఫ్యామిలీ అండ అవసరమని ఆర్టిస్ట్‌లంతా ఇన్నాళ్లు భావిస్తూ వచ్చారు.అది కేవలం భావన మాత్రమే కాదు కూడాను. బుల్లెతెర నుంచి వెండి తెరవరకు …ఏ చిన్నపాటి కళాకారుడైనా సరే చిరంజివి మాట పలికినా,ఆయన బొమ్మ పెట్టినా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, ఫలితంగా మంచి పేరుప్రఖ్యాతులు,డబ్బు సంపాదించవచ్చనేది కళాకారుల నమ్మకం. అలాంటి చిరంజీవిని గానీ,ఆయన ఫ్యామిలీని గాని విమర్శిస్తున్నట్లు పోస్ట్ చేసినా ప్రకటన చేసినా పాపం ఇక ఆ కళాకారుల సంగతి అంతే.అలాంటి బలమైన హీరోని,ఇండస్ట్రీకి బాస్‌గా భావించే చిరంజీవిని అల్లు అర్జున్ పుష్ప 2 మూవీలో పరోక్షంగా ర్యాగింగ్ చేశాడని మెగా అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.” ఎవడు ఎవడికిరా బాసు…ఆడికి(చిరంజీవి) ఆడి కొడుక్కి(రామ్ చరణ్),ఆడి తమ్ముడు (పవన్ కళ్యాణ్)కి కూడా నేనేరా బాస్ ” . ..అంటూ మూవీలో అల్లుఅర్జున్ వైల్డ్ గా ఫైర్ అవడంతో ఈ మాటలన్నీ చిరంజీవిని ని ఆయన కొడుకు,తమ్ముడుని ఉద్దేశించే అన్నారని మండిపడుతున్నారు.పుష్పకి నెగటివ్ టాక్ తీసుకురావడంతో మెగా అభిమానులు విఫలయత్నం చేశారని సోషల్ మీడియా వేదికగా అల్లు ఆర్మీ నిప్పులు చెరుగుతుంది. అల్లు అర్జున్ ఫంక్షన్లలోనూ పవన్ స్టార్ …పవర్ స్టార్ అంటూ పవన్ అభిమానులు చేసే ర్యాగింగ్‌కి ధీటైన ర్యాగింగ్ అల్లు అర్జున్ తన పుష్ప2 లో చూపించారని అల్లు ఫ్యాన్స్ హ్యాపీయెస్ట్ గా ఇగో శాటిస్‌ఫ్యాక్షన్‌ని ప్రదర్శిస్తున్నారు.