మర్యాదలో అతనికి అతనే సాటి
సినిమాల్లోని పాత్రల్లో గంభీరంగా కనిపిస్తూ వెండి తెరపై రెబల్ స్టార్‌గా వెలుగొందిన కృష్ణంరాజు మనసు వెన్న. అతిథి మర్యాదలో ఆయనకు ఆయనే సాటి. తాను షూటింగ్‌లో పాల్గొన్నారంటే ఆ సెట్‌లో ఉన్నవారందరికి కృష్ణంరాజు ఇంటి నుంచే భోజనమ వెళ్తుంది. తన టీమ్‌ను అంత బాగా చూసుకునేవారు. భోజనం తీసుకెళ్లడమే కాదు ఇక వద్దు సర్ చాలు సర్ అని అన్నా వినేవారు కాదట. ప్రతి ఒక్కరు కడుపు నిండా తినేంత వరకు ఊరుకునే వారు కాదు. ఆయన్ను మర్యాద రామన్న అని పిలుస్తుంటారు. కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ సైతం ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారు.