Home Page SliderNational

కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు

బిచ్చగాడు అంటే తిండికి కూడా లేక పదిమందినీ బిక్ష యాచించేవాడు. కానీ ఈ ముంబై బిచ్చగాడి గురించి తెలిస్తే కళ్లు తేలేయవలసిందే. ఎందుకంటే ఈ బిచ్చగాడికి కోట్ల ఆస్తి ఉంది మరి. ముంబై నివాసి భరత్ జైన్‌ను చూసే బిచ్చగాడు సినిమా తీసినట్లున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ భరత్ జైన్‌ను అత్యంత సంపన్న బిచ్చగాడిగా గుర్తించింది నేషనల్ మీడియా. ఇతని ఆస్తి విలువ 7.5 కోట్ల రూపాయలు. అతనికి ముంబైలో 1.2 కోట్ల విలువ చేసే డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్, థానేలో 30 వేల రూపాయలు రెంట్ వచ్చే రెండు షాప్‌లు ఉన్నాయట. అంతేకాక అతనికి రోజుకు 2500 రూపాయల వరకూ బిక్షాటన ఆదాయం కూడా వస్తుందట. అంటే నెలకు లక్షన్నర దాకా ఈజీగా సంపాదించేస్తున్నాడు ఈ లక్కీ బిచ్చగాడు. అంతేకాదు అతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. పిల్లలు కాన్వెంట్‌లో చదువుతున్నారట.