Home Page SliderNational

 విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు చూశారా..!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం విక్టరీ పేరెడ్‌లో పాల్గొని లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే విరాట్ తన భార్య ,పిల్లలతో సమయం గడిపేందుకు లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా విరాట్ మహరాష్ట్రలోని అరేబియా సముద్రానికి చేరువగా ఉన్న అలీబాగ్‌లో తన కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అయితే ఆ ఇంటికి సంబంధించిన వీడియోను ఆయన తాజాగా తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తన కలల ఇంటిని నిజం చేసిన ఆవాస్ టీమ్‌కు విరాట్ ధన్యవాదాలు తెలిపారు. కాగా తన ప్రియమైన వారితో ఇక్కడ కలిసి గడిపేందుకు వేచి ఉండలేకపోతున్నానని విరాట్ పేర్కొన్నారు.