‘కన్నప్పలో పార్వతిగా స్టార్ హీరోయిన్’..లుక్ చూశారా?
మంచు విష్ణు హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ లుక్ రివీల్ చేసింది. ఈ చిత్రంలో ఆమె పార్వతీదేవిగా కనిపించనుంది. ఈ చిత్రంలో ఎందరో అగ్రనటులు కనిపిస్తున్నారు. శివుడిగా ప్రభాస్ నటిస్తున్నారన్న వార్తలు వచ్చినప్పటికీ, శివుడు ప్రభాస్ కాడని, మూవీ టీం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శివుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయ్యిందని సమాచారం. అయితే ప్రభాస్ నంది పాత్రలో కనిపిస్తారని కూడా రూమర్స్ వస్తున్నాయి. హీరో విష్ణు టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. మోహన్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ, ఈ చిత్రంలో ప్రాధాన్యత కల పాత్రలో నటిస్తున్నారు. విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని ఈ చిత్రాన్ని వేసవి కానుకగా విడుదల చేస్తారని పేర్కొంటున్నారు.