లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తాళలేక ఆత్మహత్య
లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులకు మరో బలయ్యాడు.గత రెండు వారాల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో ఇలా లోన్ యాప్ వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడిన ఘటన ఇది మూడోది.విశాఖ,విజయవాడలో గత 15 రోజుల వ్యవధిలో ఇద్దరు సూసైడ్ చేసుకోగా తాజాగా మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రామాయంపేట మండలం కాట్రియాలలో నివశించే గంగాధర్(28) అనే యువకుడు లోన్ యాప్ నుంచి రూ.3లక్షల రుణం తీసుకున్నాడు.నెలవారి వాయిదాలు సరిగ్గా చెల్లించకపోవడంతో ఏజెంట్లు ఇంటి ముందుకొచ్చి ఇబ్బంది పెట్టారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

