Andhra PradeshHome Page Slider

‘ఆదిపురుష్’ థియేటర్లలో ‘హనుమాన్ సీట్’

ఆదిపురుష్ మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయిస్తున్నట్లు సినిమా నిర్వాహకులు అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. రామకథ ఎక్కడ వినిపిస్తే అక్కడ భగవాన్ హనుమ ఉంటారని, అందుకే ప్రతీ షోలో ఒక సీటును రిజర్వ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రోజు జరుగబోయే ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు సర్వం సిద్దమైంది. శ్రీరాముని పాత్రధారి ప్రభాస్ ఈ రోజు తిరుమల చేరుకుని, సంప్రదాయ వస్త్రాలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ ఈవెంట్‌కు 100 మంది కళాకారులతో, గాయకులతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకత్వం వహించారు. ఈ ఈవెంట్ స్టేజ్‌‌ను అయోధ్యలా ముస్తాబు చేసారు.

మ్యూజిక్ డైరక్టర్ అతుల్ ముంబై నుండి తిరుపతికి బైక్‌పై వచ్చి మొక్కు తీర్చుకున్నారు. ఈ ఈవెంట్‌కు యాంకర్ ఝాన్సీ, నూతన నటుడు తేజ సజ్జా వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. దీనికి దాదాపు లక్షమంది హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు. తిరుపతికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఎన్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ వేదిక పై గ్యాలరీలకు కూడా రామాయణంలోని ఊరిపేర్లనే పెట్టారు. మిథిల, అయోధ్య, కిష్కింధ అనే పేర్లతో గ్యాలరీలను పిలుస్తున్నారు. దీనిలో 50 అడుగుల ప్రభాస్ హాలోగ్రామ్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ఈవెంట్‌కు చిన్న జియ్యరు స్వామి గారు ముఖ్యఅతిథిగా రాబోతున్నారు. ఈ ఈవెంట్‌ను 2 కోట్ల రూపాయల ఖర్చుతో వైభవంగా చేయబోతున్నారు.