అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ కరెంట్ చార్జీల హామీ
ఇది ఇండియా కాదు. తెలంగాణ-ఆంధ్రా-ఢిల్లీ అంత కంటే కాదు.. ఇది పక్కా అమెరికా.. త్వరలో అధ్యక్ష ఎన్నికల జరగనున్న తరుణంలో ఆ దేశంలో విద్యుత్ చార్జీలు, ఇతర ఇంధన చార్జీలను సగానికి సగం తగ్గిస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 12 నెలల్లో ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ధరలను సగానికి తగ్గిస్తాను. మా పర్యావరణ ఆమోదాలను వేగవంతం చేస్తాం. విద్యుత్ సామర్థ్యాన్ని త్వరగా రెట్టింపు చేస్తాం. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది. సంస్థల నిర్మాణానికి అమెరికా, మిచిగాన్‌లను భూమిపై అత్యుత్తమ ప్రదేశంగా మారుస్తుందంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ట్రంప్ అభయమిస్తున్నాడు. మొన్నటి వరకు అమెరికా, అమెరికన్లకే, ఇతర దేశస్తులను తరిమేస్తామంటూ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ ఇప్పుడు అమెరికన్లకు ఉచితాలతోపాటు, ఆఫర్లు అందిస్తానంటూ కొత్త పల్లవి అందుకున్నాడు.

