BusinessHome Page SliderNationalNews Alert

జొమాటోకు జీఎస్టీ షాక్..

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు జీఎస్టీ విభాగం పెద్ద షాక్ ఇచ్చింది. వడ్డీ, జరిమానాలతో కలిపి ఏకంగా రూ. 803 కోట్ల పన్ను చెల్లించాలని థానేలోని జీఎస్టీ విభాగం ఆదేశించింది. డెలివరీ ఛార్జీలపై వడ్డీ, పెనాల్టీతో జీఎస్టీని చెల్లించలేదని జొమాటో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2019లో రూ. 401 కోట్లు, 2024లో రూ.402కోట్ల పెనాల్టీ చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై న్యాయ సలహా దారులతో చర్చించి అప్పీల్ చేస్తామని జొమాటో పేర్కొంది. జొమాటో బిల్లులో ఆహార పదార్థాల ధరతో పాటు ఫుడ్ డెలివరీ ఛార్జ్, ఆహారం ధర. ఫ్లాట్‌ఫామ్ ఫీజుపై విధించే ఐదు శాతం జీఎస్టీ పన్ను. అయితే ఫుడ్ డెలివరీ ఛార్జిలపై ట్యాక్స్ చెల్లించడం లేదని జీఎస్టీ విభాగం ఆరోపిస్తోంది.