స్విగ్గీకి జీఎస్టీ భారీ షాక్..
ఫాస్ట్ డెలివరీ యాప్ స్విగ్గీకి జీఎస్టీ భారీ షాక్ ఇచ్చింది. డెలివరీ ఛార్జీలపై జీఎస్టీ పన్నులు బకాయిలు ఉందంటూ స్విగ్గీకి రూ.158 కోట్ల జీఎస్టీ నోటీసు అందింది. 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి మధ్య కాలంలో కట్టవలసిన బకాయిలు రూ.158.27 కోట్లపై తమకు నోటీసులు అందాయని, దీనిపై తాము సంబంధిత అధికారుల ముందు అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ నుండి వచ్చిన ఆదేశాలు తమ ఆర్థిక కార్య కలాపాలపై ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంది.