Home Page SliderNational

నవ వధువును హెలికాప్టర్‌లో తీసుకెళ్లాడు..

నవ వధువును అత్తారింటికి హెలికాప్టర్‌లో ఓ వరుడు తీసుకెళ్లాడు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. నూహు జిల్లాకు చెందిన కోమల్ ను పెళ్లైన వెంటనే తన భర్త కపిల్ హెలికాప్టర్ లో మెట్టింటికి తీసుకెళ్లాడు. హెలికాప్టర్ లో వెళ్తున్న కుమార్తెను చూసి ఆమె తల్లితో సహా బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఇలాంటి రోజు కూడా వస్తుందని తను కలలో కూడా ఊహించుకోలేదని కోమల్ తెలిపింది. ఇంతకుముందు ఇలా మా ప్రాంతంలో ఎప్పడూ జరగలేదు. తను సంతోషంగా ఉన్నానని.. ఎవరైనా ఒకరి కోసం ఇంతగా చేస్తారని తను ఎప్పుడూ ఊహించుకోలేదని ఆమె పేర్కొంది.

అదే రాష్ట్రంలోని పల్వల్ జిల్లాకు చెందిన కపిల్ కు తన భార్యను హెలికాప్టర్ లో తీసుకు రావాలని కోరిక ఉండేది. ఇదే విషయాన్ని తన ఫ్యామిలీతో చెప్పేవాడు. ఇటీవలే కపిల్ కి కోమల్ తో ఘనంగా పెళ్లి జరగగా హెలికాప్టర్ కోరికను తీర్చుకున్నాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కపిల్ ప్రైవేట్ హెలీకాఫ్టర్‌ను 4 లక్షలకు బుక్ చేసుకొని భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య తండ్రి చనిపోయాక బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుందని తనని హెలీకాఫ్టర్‌ లో ఎక్కించి సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నానని వరుడు కపిల్ తెలిపాడు.