విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుకుంటోంది: KTR
TG: విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. అన్ని రాష్ట్రాల్లో MBBS, BDS అడ్మిషన్లు కొనసాగుతున్నా ఇక్కడ మాత్రం ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదు, అసలు అడ్మిషన్ల ప్రస్తావనే లేదు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్‌గా మార్చే కుట్ర ఏమైనా జరుగుతోందా అనే అనుమానం కలుగుతోంది. స్థానికతపై ప్రభుత్వం ఎందుకు వివాదాస్పదంగా మారుద్దామని చూస్తోంది? BRS రాష్ట్రంలో డాక్టర్లను పెంచుదామని కాలేజీలు పెంచి, సీట్లు సంఖ్య పెంచితే, కాంగ్రెస్ దానికి తూట్లు పొడుస్తోంది అని ఆయన ఎక్స్‌లో పోస్టులు పెట్టారు.