Home Page SliderTelangana

రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన గవర్నర్,సీఎం కేసీఆర్

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ చేరుకున్నారు. కాగా హైదరాబాద్‌లో జరగబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. దీనికోసం ఆమె ప్రత్యేక విమానంలో హాకీంపేట ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ  తెలంగాణా గవర్నర్ తమిళిసై,సీఎం కేసీఆర్,ఇతర మంత్రులు రాష్ట్రపతికి  సాదర స్వాగతం పలికారు. కాగా ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో జరిగే అల్లూరి జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహరాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.