యూట్యూబ్, ఓటీటీలకు ప్రభుత్వ హెచ్చరికలు
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కేసు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రసారమయ్యే అన్ని ఓటీటీలకు, యూట్యూబ్ ఛానెల్స్‌కు తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఐటీ రూల్స్ 2021లోని కోడ్ ఆప్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పకుండా పాటించాలని హెచ్చరించింది. అలాగే చిన్నారులకు ఎ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. కుటుంబ వ్యవస్థలపై, సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపిల్లలపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, వీడియోలు ప్రసారం చేస్తే తగిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.

