ప్రభుత్వ ఇంజినీరు నిర్వాకం..కిటికీలోంచి కరెన్సీ వర్షం
ఒడిశాలోని రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి అనే చీఫ్ ఇంజినీర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనితో అతని ఇంటికి వెళ్లిన విజిలెన్స్ అధికారులకు షాక్ తగిలింది. ఎందుకంటే వీరిని చూసిన ఆ అధికారి కరెన్సీ నోట్లను కిటికీలోంచి విసిరేశాడు. ఈ కరెన్సీ వర్షంతో రోడ్డుపై వెళ్లేవారు నివ్వెరపోయారు. కిటికీ నుండి విసిరిన నోట్లను కూడా రికవరీ చేసిన అధికారులు రూ.2 కోట్లకు పైగా నగదును లెక్కపెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

