రాష్ట్రపతి దృష్టికి గోరంట్ల మాధవ్ వ్యవహారం
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాష్ట్ర పతి దృష్టికి వెళ్ళింది. డిగ్నిటీ ఫర్ ఉమెన్ పేరిట వివిధ మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల మహిళా విభాగం నేతలు ఓ కమిటీగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి ఢిల్లీ వెళ్ళి మాధవ్ వ్యవహారంతో పాటు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారని .. ఈ విషయాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారని మహిళా సంఘం నేతలు తెలిపారు. ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకు వెళ్ళారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ వెళ్ళిన మహిళా నేతల్లో వంగలపూడి అనిత, జ్యోత్స్న, పద్మశ్రీ సుంకర, కీర్తి, పుణ్యవతి, రాణి, జయలక్ష్మి, కల్యాణి తదితరులు ఉన్నారు. దేశ అత్యున్నత చట్ట సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాధవ్ .. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని , చిల్లరగా ప్రవర్తిస్తు్నారని మహిళా సంఘాలు ఆరోపించాయి. ఇతని దుష్ప్రవర్తనపై తమ పోరాటం ఆగదని మహిళా సంఘాల నేతలు స్పష్టం చేశారు.
