మహిళలకు శుభవార్త..
ఏపీ ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మహిళలకు పెట్టుబడిలో రాయితీని ఇస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఈ రాయితీ ప్రస్తుతం 35 శాతం ఉండగా, 45 శాతానికి పెంచింది. మొత్తం పెట్టుబడిలో 45 శాతం గానీ, గరిష్టంగా రూ.75 లక్షల వరకూ రాయితీ లభిస్తుంది. విద్యుత్ రాయితీ కూడా యూనిట్‌కు రూ.1.50 చొప్పున ఐదేళ్లు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా భూమి విలువపై ఇచ్చే 50 శాతం రాయితీని, 75 శాతానికి పెంచింది. గరిష్టంగా రూ.25 లక్షలు రాయితీ ఇవ్వనుంది. ఈ నిర్ణయాలన్నింటికీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.