మధ్యతరగతికి గుడ్‌న్యూస్
మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిస్తోంది నయా బడ్జెట్. ఎప్పటినుండో వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్న ఇన్‌కం ట్యాక్స్ స్లాబ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. వార్షిక ఆదాయం రూ.12 లక్షల వరకూ ఇన్‌కం ట్యాక్స్ లేదని తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి ఈ ట్యాక్స్ విధానం అమలులోకి రానుంది. ఆదాయపు పన్ను శ్లాబుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలని వ్యాఖ్యానించారు. దీనితో మధ్యతరగతి ప్రజలు దాదాపు 50 శాతం పన్నుపోటు నుండి తప్పించుకునే అవకాశం ఉంది. రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపజేస్తామని తెలిపారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మరో రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెరగనుంది. మొత్తంగా రూ.12.75 లక్షల వార్షికాదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది.
కొత్త పన్ను శ్లాబులు..
రూ. 4 లక్షల వరకు – పన్ను లేదు
రూ.4 నుంచి 8 లక్షల వరకు – 5%
రూ.8 నుంచి 12 లక్షల వరకు – 10%
రూ.12 నుంచి 16 లక్షల వరకు – 15%
రూ. 16 లక్షల నుండి 20 లక్షల వరకూ 20 శాతం పన్ను
రూ. 20 నుండి 24 లక్షల వరకూ 25 శాతం పన్ను
రూ. 24 లక్షల ఆదాయం దాటితే 30 శాతం పన్ను