Home Page SliderNationalNews AlertSports

కోహ్లి అభిమానులకు గుడ్‌న్యూస్..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ తెలిపింది. కోహ్లి దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ రంజీ ట్రోఫీలు ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌‌లకు టీవీలో లైవ్ స్ట్రీమింగ్‌కు అవకాశం లేదు. కానీ బీసీసీఐ కోహ్లి కోసం, అతని అభిమానుల కోసం తన నియమాలను సడలించింది. జియో సినిమా ఓటీటీలో ఢిల్లీ లైవ్ మ్యాచ్ స్ట్రీమింగ్ కానుందని పేర్కొంది. అయితే సాధారణంగా రంజీ మ్యాచ్‌లు లైవ్ స్ట్రీమింగ్‌కు అవకాశం లేదు. రోస్టర్ విధానంలో 3 మ్యాచ్‌లకు మాత్రమే ఈ అవకాశం ఉంది. ఢిల్లీ తరపున జనవరి 30 నుండి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లలో కోహ్లి మైదానంలో దిగుతారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ల కోసం కోహ్లి ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. అతని చిన్ననాటి స్నేహితుడు షావెజ్ కుమారుడు 8 ఏళ్ల కబీర్ అనే బాలుడు కోహ్లి వద్దకు వచ్చి, భవిష్యత్తులో భారత టీమ్‌లో ఆడాలంటే ఏం చేయాలని అడిగాడు. దానికి కోహ్లి బదులిస్తూ, చాలా కష్టపడాలని, రోజూ సాధన చేయాలని పేర్కొన్నాడు.