పసిడి ప్రియులకు శుభవార్త
పసిడి కొనుగోలు దారులకు శుభవార్త. బంగారం ధరలు దీపావళి పండుగ వేళ పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తున్నాయి. కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్న ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.600 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల ధర రూ.79.470 ఉంది. అలాగే 22 క్యారెట్ల ధరలు గ్రాముకు రూ.550 తగ్గింది. దీని ధర 10 గ్రాములకు రూ.72,850గా నమోదయ్యింది. వెండి కూడా కేజీకి రూ.2000 తగ్గి రూ.1,10,000 వద్ద నిలిచింది.

