క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్..
క్యాన్సర్ రోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ప్రభుత్వం. నేడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో క్యాన్సర్ వంటి ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన 36 రకాల మందులను ప్రాథమిక కస్టమ్ డ్యూటీ నుండి మినహాయిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. క్యాన్సర్ రోగులకు ఇకపై ఖరీదైన వైద్యం అందుబాటులోకి రానుంది. అలాగే పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే చికిత్సకు వాడే మందులు కూడా అక్కడ చౌకగా ఉంటాయని పేర్కొన్నారు. ఆరు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్‌పై కస్టమ్ డ్యూటీని ఐదు శాతానికి తగ్గిస్తున్నట్లు ఈ బడ్జెట్‌లో పేర్కొన్నారు. అలాగే కస్టమ్స్ సుంకం నుండి మరో 37 రకాల మందులను, 13 కొత్త పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రాలను మినహాయిస్తున్నట్లు తెలిపారు.

