బీటెక్ ఫ్రెషర్స్‌కి గుడ్‌న్యూస్
బీటెక్ గ్రాడ్యుయేట్స్‌కి క్యాంపస్ సెలక్షన్స్‌లో భారీగా రిక్రూట్ చేసుకుంటామంటూ కంపెనీలు గుడ్‌న్యూస్ చెప్తున్నాయి. ఇటీవల టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకోబోతున్నట్లు తెలిపాయి. తాజాగా విప్రో కంపెనీ కూడా ఆ జాబితాలో చేరింది. విప్రో చీఫ్ హెచ్‌ఆర్ విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 వేల మంది ఫ్రెషర్స్‌ని నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విప్రో తెలిపింది. 20 వేల మందిని రిక్రూట్ చేసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది.

