వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం – వసతుల లేమితో భక్తుల అవస్థ
ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అతి వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో ఈ కళ్యాణం చూడడానికి పోటెత్తారు. అయితే సరైన భద్రతా చర్యలు, సదుపాయాల కొరత స్పష్టంగా కనిపించింది. ఎండకు తాళలేక, నీరు దొరకక కొంతమంది సృహ తప్పి పడిపోయారు. పశు సంవర్థక శాఖామంత్రి తలసాని యాదవ్ ఈ కళ్యాణానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వసతి సదుపాయం గురించి ముందుగానే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. వసతుల లేమితో భక్తులు మండిపడుతున్నారు.

