రూ.100కోట్ల ఎర్రచందనం విక్రయించేందుకు గ్లోబల్ ఈ టెండర్లు
ఏపిలో వివిధ ఘటనల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.905.671 టన్నుల ఎర్రచందనం విక్రయించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.గ్రేడుల వారీగా మూడు దశల్లో వేలం వేయాలని నిర్ణయించింది.ఈనెల 28, మార్చి 6, 13 తేదీల్లో మూడు దఫాలుగా వేలం వేయనున్నారు.ప్రారంభ ధర నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు చేశారు.ఈ మేరకు గ్లోబల్ ఈ టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో దీని ధర టన్ను రూ.10లక్షలకు పైనే ఉంది. గ్లోబల్ టెండర్లు పిలిస్తే కనీసం రూ.దాదాపు రూ.100కోట్లకు పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

