UPSC లో అదరగొట్టిన అమ్మాయిలు
కేంద్రప్రభుత్వ కొలువుల్లో ప్రతిష్టాత్మకంగా భావించే UPSC ఫలితాలు వచ్చేశాయి. టాప్ ర్యాంకుల్లో అమ్మాయిలదే హవా. మొదటి నాలుగు ర్యాంకుల్లో విజయదుందుభి మ్రోగించారు. ఫస్ట్ ర్యాంకులో ఇషితా కిశోర్ అదరగొట్టింది. తదుపరి ర్యాంకుల్లో గరిమ లోహియా, ఉమాహారతి, స్మృతి మిశ్రా మెరిసారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు టాప్ ర్యాంకుల్లో ప్రతిభ చాటారు. తిరుపతికి చెందిన జీవీఎస్ పవన్ దత్తాకు 22 ర్యాంకు రాగా, శ్రీ సాయి అర్షిత్ 40, సాయికృష్ణకు 94, శివమారుతీరెడ్డికి 132, వసంతకుమార్‌కు 157, మహేశ్ కుమార్ 200 ర్యాంకులలో నిలిచారు. 16 మంది తెలుగు విద్యార్థులు 500 లోపు ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు. మొత్తంగా 933 మంది సివిల్స్‌కు సెలక్ట్ అయ్యారు.

