కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, జమ్ము, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఇటీవలే ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన జమ్ము, కశ్మీర్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ పదవికి సైతం రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు చేసిన జీ-23 నాయకుల్లో ఆజాద్ ముఖ్యులు.






