Home Page SlidermoviesNewsTelanganatelangana,Trending Today

గద్దర్ అవార్డులు ప్రకటన..’ఉత్తమనటుడు’ ఎవరంటే?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను నేడు జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటిస్తున్నామని, మొత్తం 11 కేటగిరీలలో వెల్లడిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 1248 నామినేషన్లు వచ్చాయన్నారు. వ్యక్తిగత విభాగంలో ఉత్తమ నటుడిగా ‘పుష్ప2’ చిత్రానికి అల్లుఅర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు) సెలక్టయ్యారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు. 2014 నుండి 2023 వరకూ సెన్సార్ అయిన చిత్రాలలో ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి బహుమతి ప్రకటించారు. అలాగే 2024వ సంవత్సరానికి అన్ని కేటగిరీలలోనూ అవార్డులు ప్రకటించారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలకు కూడా అవార్డులివ్వడం విశేషం. గద్దర్ పేరుతో పాటు ఎన్టీఆర్, పైడి జయరాజ్, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి- చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా ప్రత్యేకంగా అవార్డులు ప్రకటించారు.

2024 సంవత్సరానికి గాను ‘కల్కి 2898ఏడీ’- ఉత్తమ చిత్రంగా, ‘పొట్టేల్’- రెండవ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, ‘లక్కీ భాస్కర్’- 3వ బెస్ట్ చిత్రం, ఉత్తమ బాలల చిత్రం-’35 ఇది చిన్న కథ కాదు’ ఎన్నికయ్యాయి. అలాగే వ్యక్తిగత విభాగాలలో ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్- ‘కల్కి 2898ఏడీ’ ఎన్నికయ్యారు.