ఏపీలో హెల్త్ పెన్షన్‌దారులకు ఉచితబస్సు
ఏపీ ప్రభుత్వం హెల్త్ పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఉచితబస్సు సౌకర్యం కల్పించనుంది. దీర్ఘకాలిక గుండె, లివర్, కిడ్నీ జబ్బులు, తలసేమియా, లెప్రసీ, పక్షవాతం, హీమోఫీలియా వంటి సమస్యలతో బాధపడే రోగులకు హెల్త్ పెన్షన్లు ఇస్తున్నారు. వారందరికీ చికిత్స కోసం పట్టణాలలోని ఆసుపత్రులకు వచ్చి వెళ్లేందుకు బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనివల్ల దాదాపు 51 వేల మందికి మేలు జరగనుంది. రోగులు ఆసుపత్రులకు వెళ్లడానికే రూ.200 నుండి రూ.600 వరకూ ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఉచిత ప్రయాణం అమలు చేస్తే వారికి ఉపయుక్తంగా ఉంటుంది.