crimeHome Page SliderTelanganatelangana,viral

ఎమ్మెల్యే ఫోటోతో వివాహ వెబ్‌సైట్లో మోసం..

తన కాలేజ్ మేట్ అయిన యానాం ఎమ్మెల్యే ఫోటోలను పెళ్లి కొడుకుగా పెట్టి నాలుగు రాష్ట్రాలలో పెళ్లి పేరుతో 26 మంది యువతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా యువతులను మోసగించాడు చెరుకూరి హర్ష(33). ఎన్‌ఆర్‌ఐగా నటిస్తూ పెళ్లి చేసుకుంటానని, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను పెట్టి హైదరాబాద్‌లోని ఒక వైద్యురాలిని షాదీ డాట్ కామ్ వెబ్‌సైట్ ద్వారా ఎన్‌ఆర్‌ఐగా పరిచయం చేసుకుని రూ.10 లక్షలకు పైగా మోసం చేశారు. తన తల్లి అమెరికా నుండి వచ్చాక వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. మోసం తెలుసుకున్న ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. అతనిపై హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంలతో పాటు పలు రాష్ట్రాలలో 20కి పైగా కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇలా మోసం చేయగా వచ్చిన డబ్బుతో విదేశీ టూర్లు, బెట్టింగులు వంటి కార్యక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.