InternationalNews

రాహుల్ అనర్హతపై విదేశీ చట్టసభ్యుడు వ్యాఖ్యలు

Share with

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై లోక్‌సభకు అనర్హత వేటు వేయడం దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. భారత సంతతికి చెందిన అమెరికా చట్టసభ సభ్యుడు రోఖన్నా ట్విటర్ వేదికగా రాహుల్‌పై అనర్హత వేటుపై  తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాహుల్‌పై పార్లమెంట్ సభ్యత్వంపై వేటు వేయడం అంటే గాంధీ సిద్ధాంతాలకు, భారత దేశ విలువలకు తీవ్ర ద్రోహం చేసినట్లేనన్నారు. భారత ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవల్సిందిగా ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు. తన తాతయ్య స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, ఎన్నో ఏళ్లు జైలులో గడిపింది దీనికోసం కాదన్నారు.  రోఖన్నా తాతయ్య అమర్‌నాథ్ విద్యాలంకార్ భారత స్వతంత్య్ర పోరాటంలో లాలా లజపతి రాయ్‌తో కలిసి పనిచేసి, కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు.