కాల్వలో పడి నలుగురు గల్లంతు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలేరు కాల్వలో పడి ప్రమాదవశాత్తు నలుగురు గల్లంతైన ఘటన శుక్రవారం జరిగింది. అనధికార ర్యాంపు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.గల్లంతైన వారంతా ఏలేశ్వరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారి గా గుర్తించారు.కాగా అనధికార ర్యాంపుల్లో తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు,వీరిని బాడుగకు తీసుకుంది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కాగా అధికారులు గాలింపు చర్యలకు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.

