ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టుకోవచ్చు..కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో అవసరమైతే ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చలు పెట్టకోమంటూ సవాల్ చేశారు. ఇది కేవలం హైదరాబాద్‌కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాం. కానీ అందులో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. మా పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ రేస్‌ల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.700 కోట్ల లబ్ధి పొందింది అన్నారు. ఈ విషయంపై శాసనసభలో చర్చ జరిగితే అసలైన నిజాలు బయటపడతాయని పేర్కొన్నారు. మీరు నాలుగు గోడల మధ్య చర్చలు చేసుకుని, గవర్నర్ ఆమోదం పొంది నాపై కేసులు పెట్టాలని ఆలోచనలు చేసేకన్నా శాసనసభలో నాలుగుకోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు అందరికీ తెలుస్తాయన్నారు. 2024లో మరో సారి ఈ రేస్ జరగాల్సి ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. అవాస్తవాలు ప్రచారం చేసి, ఏదో జరిగిపోయిందని అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు సభాపతికి వినతిపత్రం సమర్పించారు.