క్యాన్సర్‌తో పోరాడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో వెల్లడించారు. జో బైడెన్‌కు క్యాన్సర్ విషయం తెలిసి, తాను, తన భార్య మెలానియా చాలా బాధపడ్డామని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షలలో ప్రొస్టేట్‌లో క్యాన్సర్ కణితి ఏర్పడినట్లు గుర్తించారు. దీనికి చికిత్స అందించే విషయంలో కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ విషయం తనను కలచివేసిందని, బైడెన్ పోరాట యోధుడని, క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు.