మాజీ ఎమ్మెల్యే మృతి
తెలంగాణ సిద్దిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే డి. రామచంద్రారెడ్డి (85) ఆదివారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందతూ మరణించారు. ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి టీడీపీలో ఉండేవారు. 1985లో దొమ్మాట (దుబ్బాక) నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన వారి కుమార్తెల వద్ద ఉంటున్నారు. వారి స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక. ఆయన మృతిపై బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిరాడంబరమైన సాధారణ జీవితాన్ని గడిపేవారని గుర్తు చేసుకున్నారు.