ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదర్కొంటున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసిపి వెంకటగిరి ఎదుట జరిగిన విచారణకు వచ్చారు.తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదని,ఎవరి ఫోన్‌లు ట్యాప్ చేయించలేదని,అంత అవసరం తనకు లేదన్నారు.ఫోన్ ట్యాపింగ్ పోలీసులు చేస్తారే తప్ప రాజకీయ నాయకులు చేయరన్నారు. తాను ఇటీవల జ్వరంతో బాధపడ్డానని దాని కారణంగా లాస్ట్ టైం ఎంక్వయిరీకి రాలేకపోయానని వెల్లడించారు. మీరు ఈ విషయంలో ఎన్ని సార్లు ప్రశ్నించినా నాకు తెలియదు…నాకు తెలియదు అనే ఆన్సరే చెప్తానని అదుర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు చెప్పడంతో విచారణ మందకొడిగా సాగుతుంది.