Home Page SliderNational

అదే రక్తం.. అదే పౌరుషం.. కాంగ్రెస్‌ను వదిలేదేలే!

ఏపీ మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో శక్తిమేరకు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానన్నారు. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. కర్నాకటలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న రఘువీరా, తాను ఎందుకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చానో చెప్పారు. గత కొద్ది రోజులుగా సొంత గ్రామంలో నీలకంఠాపురం ఆలయాన్ని నిర్మించానని.. అందుకే నాలుగేళ్లపాటు రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. అయితే దేశ రాజకీయాలను చూశాక.. కాంగ్రెస్ పార్టీకి తిరిగి మద్దితివ్వాలని భావించానన్నారు.

ప్రధాని మోదీని రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నాడని ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని.. ఇది చూసి మనసు కలచివేసిందన్నారు. అందుకే తాను ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చి.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించానన్నారు. మోదీ, రాహుల్ గాంధీని అవమానించడం వల్లే ప్రజలు కర్నాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఏఐసీసీ తనను బెంగళూరు నగర పరిశీలకుడిగా నియమించిందని.. నగరం మొత్తం ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని.. తర్వాత అభిమానులు ఎలా చెప్తే తాను రాజకీయంగా అలా అడుగులు వేస్తానన్నారు రఘువీరా.