Telangana

టీఆర్ఎస్‌లో చేరిన దాసోజు శ్రవణ్‌, స్వామి గౌడ్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్ సమక్షంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్‌, గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ ఇద్దరికి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. స్వామి గౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యమ కాలంలో కలిసి పనిచేసిన వారు తిరిగి పార్టీలోకి రావడం ఆనందించదగ్గ పరిణామమని కేటీఆర్ వారిని అభినందించారు. వారితో గతంలో ఉన్న అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ మాట్లాడుతూ.. ఏ ఆశయాల కోసమైతే బీజేపీలో చేరామో అవేవి నెరవేరలేదని ఇప్పడు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతో తమ ఆకాంక్షలు నెరవేరుతాయనే భావిస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్‌లోకి తనను తిరిగి ఆహ్వానించినందుకు కేసీఆర్, కేటీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.