మాజీ క్రికెటర్ పరిస్థితి విషమం
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆడుతుండగానే అతడికి గుండెపోటు వచ్చింది. దీనితో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేర్కొంది. నేడు మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్, షినెపుకర్ క్రికెట్ క్లబ్‌ల మధ్య ఢాకా ప్రీమియర్ లీగ్ జరగనుంది. మహమ్మదన్ క్లబ్ కెప్టెన్‌గా ఉన్న తమీమ్ టాస్ కోసం వచ్చిన సమయంలోనే గుండెపోటుకు గురయ్యారు. గత ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. బంగ్లా తరపున 243 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి, 8 వేల పరుగుల పైన నమోదు చేశారు.

