Home Page SliderTelangana

ముదిరాజ్‌ల కోసం రూ. 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్

తెలంగాణలో అతిపెద్ద కమ్యూనిటీ అయిన ముదిరాజ్‌ల కోసం రూ. 1000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ కోరుతున్నారు ముదిరాజ్‌లు.  వారి సంక్షేమం కోసం  అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేయాలని ముదిరాజ్ చైతన్యవేదిక అధ్వర్యంలో నిర్వహించిన సభలో రాష్ట్రఅధ్యక్షుడు శివ ముదిరాజ్  డిమాండ్ చేశారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులానికి రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పీట వేయాలని, 60లక్షలు ఓట్లు కలిగిన ముదిరాజ్ లను తెలంగాణలో ఉన్న అధికార , ప్రతిపక్ష పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నాయని మండిపడ్డారు.

రానున్న ఎన్నికల్లో ముదిరాజ్ ల న్యాయమైన డిమాండ్ లను వెంటనే పరిష్కరిచాలని  హైదరాబాదులోని గన్ పార్క్ అమర వీరుల స్తూపం దగ్గర ముదిరాజ్ ల మేనిఫెస్టో ను విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా, ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న BC -D నుండి BC – A లోకి మార్చాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత , స్థానిక ,జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు , కార్పొరేషన్ చైర్మన్లు గా నియామకం హామీ ఇవ్వాలని, ముదిరాజ్ మహిళా సాధికారత కోసం పాటు పడలని కోరుతున్నారు. ముదిరాజ్ ల చరిత్ర, సంస్కృతిని అధ్యయనం చేయడం కోసం ఒక ప్రత్యేక స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు.

బడుగు జీవుల స్వేచ్చ, సమానత్వం కోసం పోరాటం చేసిన పండుగ సాయన్న ముదిరాజ్, తెలంగాణ ఉద్యమ ఆశయాలను, ఆకాంక్షలను నేటి సమాజానికి అందించడం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన నెల్లి లక్ష్మి నారయణ ముదిరాజ్, మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిన పోలీస్ కిష్టన్న ముదిరాజ్ల జయంతులను, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించి, ట్యాంక్ బండ్ పై విగ్రహాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ మేనిఫెస్టోలో ఉంది. దళారీ వ్యవస్థ, దోపిడీ లేని చేప పిల్లల టెండర్లపై పూర్తి హక్కులను ముదిరాజ్లకే కేటాయించాలని తెలంగాణలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీలను శివ ముదిరాజ్ డిమాండ్ చేశారు.